త్వరలో టిజిఎస్ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ: సజ్జనార్

April 15, 2025


img

మహాలక్ష్మి పధకం కారణంగా టిజిఎస్ ఆర్టీసీ ఉద్యోగులందరిపై పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. కనుక అదనపు భారాన్ని తగ్గట్లు అదనపు ఉద్యోగాలు ప్రకటించి భర్తీ చేయాలని చాలా నెలలుగా అధికారులు, ఉద్యోగులు కోరుతూనే ఉన్నారు. ముఖ్యంగా డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్కుల కొరత టిజిఎస్ ఆర్టీసీకి చాలా ఇబ్బందికరంగా మారింది. కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఏయే డిపోలలో ఎంత మందిని తీసుకోవాలనే దానిపై లోతుగా అధ్యయనం చేసిన తర్వాత కొత్తగా 3,038 మందిని నియమించబోతున్నట్లు టిజిఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. 

నిన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా బాగ్‌లింగంపల్లిలోని టిజిఎస్ ఆర్టీసీ కళా భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు వీసీ సజ్జనార్ ఈ విషయం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్స్ ఖరారు చేసినందున దాని ప్రకారమే ఈ 3,038 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేసి 2-3 నెలల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తామని వీసీ సజ్జనార్ చెప్పారు.


Related Post