స్థానిక సంస్థల ఎన్నికలు అప్పుడే కాదు!

February 13, 2025


img

తెలంగాణలో  స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడప్పుడే జరిగేలా లేవు. కులగణన సర్వే చేయడం, శాసనసభలో పెట్టి చర్చించడం, పూర్తయింది కనుక దాని ప్రకారం రిజర్వేషన్స్ ఖరారు చేసి ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుందని అందరూ అనుకుంటే సర్వే నివేదికపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విమర్శిస్తుండటంతో ఈ నెలాఖరు వరకు సర్వే చేయించాలని నిర్ణయించింది.

ఈ నివేదికపై బీసీ సంఘాలు, బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.

పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం అసాధ్యం. దాని కోసం జాతీయస్థాయిలో పోరాదుతామని చెపుతున్నారు. స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్ర ప్రభుత్వం వాటికి నిధులు మంజూరు చేయడం నిలిపివేస్తుంది.

ఆ భారం భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని భట్టి విక్రమార్క చెప్పడం చూస్తే ఇప్పట్లో ఈ ఎన్నికలు జరిగే అవకాశం లేదని ఆయన చెపుతున్నట్లే భావించవచ్చు. 


Related Post