తెలంగాణ హైకోర్టుకి కొత్త ప్రధాన న్యాయమూర్తి

January 15, 2025


img

తెలంగాణ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా చేస్తున్న జస్టిస్ ఆలోక్ ఆరాధే బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అవడంతో ఆయన స్థానంలో  హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్‌ని నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. 

జస్టిస్ సుజయ్ పాల్‌ 1990లో బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా తన పేరు నమోదు చేసుకొని న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. ఆయన తొలిసారిగా 2011లో మధ్య ప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014లో అదే హైకోర్టులో శాశ్విత న్యాయమూర్తిగా నియామితులయ్యారు.

అప్పటి నుంచి అంచెలంచెలుగా ఉన్నత స్థానాలకు ఎదురగుతూనే ఉన్నారు. మానవ హక్కుల కమీషన్, వివిద ప్రభుత్వ బోర్డులకు ఆయన న్యాయ సేవలు అందించారు. 2024, మార్చి 21న తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.


Related Post