ఫోన్ ట్యాపింగ్ కేసులో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావుకి హైకోర్టులో తాత్కాలికంగా ఊరట లభించింది. ఈ కేసులో ఆయనని అరెస్ట్ చేయవద్దంటూ ఇదివరకు జారీ చేసిన మద్యంతర ఉత్తర్వులను జనవరి 28కి హైకోర్టు పొడిగించింది.
సిద్ధిపేటకు చెందిన గదగోని చక్రధర్ గౌడ్ డిసెంబర్ 1న ఆయనపై పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. హరీష్ రావు ఇదివరకు మంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేసి నిఘా విభాగం సాయంతో తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని, రాజకీయంగా వేధించారని పిర్యాదు చేశారు.
ఆయన పిర్యాదు ఆధారంగా పంజగుట్ట పోలీసులు హరీష్ రావుపై ఐటి చట్టంలో సెక్షన్స్ ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే హరీష్ రావు హైకోర్టుని ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు. దానిని ఈ నెల 28 వరకు హైకోర్టు పొడిగించింది.