హైదరాబాద్‌లో టిమ్స్ హాస్పిటల్స్.. డిసెంబర్‌కు రెడీ

January 10, 2025

img

కరోనా వలన జరిగిన ప్రాణ నష్టం, లాక్ డౌన్ వలన ఎదురైన కష్టానష్టాలు పక్కనపెడితే, కరోనా మహమ్మారి లోకానికి ఓ గొప్ప గుణపాఠం నేర్పించిందని చెప్పవచ్చు. అటువంటి మహమ్మారులు వస్తే వాటిని ప్రభుత్వాలు, ప్రజలు ఏవిదంగా ఎదుర్కోవాలి? ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి? ఆసుపత్రులలో ఎటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి?వంటి అనేక కొత్త విషయాలు నేర్పించి వెళ్ళింది.

ముఖ్యంగా మరిన్ని ఆస్పత్రులు, వైద్య కళాశాలలు,  వైద్యులు, వైద్య సిబ్బంది అవసరమని ప్రభుత్వాలకు అర్దమయ్యేలా చేసింది.

అప్పటి నుంచే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కొత్తగా ఆస్పత్రులు, వైద్య, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటవుతున్నాయి. అదనంగా వేలమంది వైద్యులు, నర్సింగ్ సిబ్బంది అందుబాటులోకి వస్తున్నారు.

కేసీఆర్‌ హయంలోనే హైదరాబాద్‌ నాలుగు వైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటుకి శ్రీకారం చుట్టారు. గచ్చిబౌలిలో ఒకటి ఇప్పటికే అందుబాటులో ఉండగా సనత్ నగర్‌, ఎల్బీ నగర్‌, ఆల్వాల్ మూడు చోట్ల శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి.

కేసీఆర్‌ మొదలుపెట్టిన ఆ నిర్మాణ పనులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా యాదాతధంగా కొనసాగిస్తోంది. వాటిలో రూ.897 కోట్ల వ్యయంతో 11.53 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆల్వాల్ వద్ద టిమ్స్ హాస్పిటల్‌ నిర్మిస్తోంది.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవలే అక్కడకు వెళ్ళి ఆస్పత్రి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికల్లా మూడు ఆస్పత్రుల నిర్మాణ పనులు పూర్తిచేయాలని, అందుకు తగ్గట్లుగా పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

897 కోట్ల అంచనాలతో నిర్మాణం అవుతున్న ఆల్వాల్ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది

90% పూర్తయిన అల్వాల్ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులు

11.53 లక్షల స్క్వేర్ ఫీట్లలో హాస్పిటల్ నిర్మాణం

2025 డిసెంబర్ నాటికి సనత్ నగర్, ఎల్.బీ.నగర్, అల్వాల్ టిమ్స్ పూర్తి చేయాలని… pic.twitter.com/c4HdS8VWc5
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) January 7, 2025

Related Post