కేంద్ర ఎన్నికల కమీషన్ నేడు ఢిల్లీ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ముందుగా ఆ వివరాలు..
నోటిఫికేషన్: జనవరి 10, నామినేషన్స్ గడువు: జనవరి 17, నామినేషన్స్ పరిశీలన: జనవరి 18, నామినేషన్స్ ఉపసంహరణ గడువు: జనవరి 20, పోలింగ్: ఫిబ్రవరి 5, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి: ఫిబ్రవరి 8.
లిక్కర్ స్కామ్ కేసులో ఆమాద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌ని, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలను మోడీ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెట్టిస్తే, ఆయన ప్రభుత్వం కూలిపోయి, పార్టీ చెల్లాచెదుర అయిపోతుందని భావిస్తే, ఆయన జైల్లో నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తూ, పార్టీని కూడా కాపాడుకున్నారు.
బయటకు రాగానే తన పదవికి రాజీనామా చేసి, తాను ఏ తప్పు చేయలేదని ఢిల్లీ ప్రజలు నమ్మి మళ్ళీ ఓటేసి గెలిపిస్తేనే ఆ కుర్చీలో కూర్చుంటానంటూ ప్రజల సానుభూతి, మద్దతు పొందే ప్రయత్నం చేస్తుండటం బీజేపికి పెద్ద షాక్ అనే చెప్పాలి. 2013 నుంచి ఆయనని గద్దె దింపేందుకు మోడీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. కనీసం ఈసారైనా ఎన్నికలలో ఓడించగలదా? ఫిబ్రవరి 8న తెలుస్తుంది.