హిందూ పద్దతిలో వివాహం చేసుకున్న కీర్తి, ఆంటోనీ

December 12, 2024


img

ప్రముఖ నటి కీర్తి సురేష్, ఆంటోనీల వివాహం గోవాలోని ఓ ప్రముఖ రిసార్టులో బంధు మిత్రుల మద్య అంగరంగ వైభవంగా జరిగింది. ఆంటోనీ క్రీస్టియన్ అయినప్పటికీ ఇద్దరూ హిందూ మతాచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఇద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుని పెళ్ళి చేసుకుంటున్నందున ఇద్దరూ చాలా సంతోషంగా పెళ్ళి చేసుకున్నారు. 

ఆంటోనీ, కీర్తి సురేష్ పాఠశాలలో చదువుకుంటున్నప్పుడే మంచి స్నేహితులుగా ఉండేవారు. పెరిగి పెద్దయి ఎవరి జీవితాలు వారు, ఎవరి వృత్తిలో వారు బిజీగా ఉన్నా అది వారి స్నేహానికి అడ్డుకాలేదు. పైగా ఇద్దరూ ఘాడమైన ప్రేమలో పడ్డారు. దాదాపు 15 ఏళ్ళ వారి స్నేహం, ప్రేమ, ఇప్పుడు వివాహ బంధంగా మారింది. 

ఆంటోనీకి కొచ్చి, చెన్నై, దుబాయ్‌లో వ్యాపారాలున్నాయి. ఇక కీర్తి సురేష్ సినీ ప్రస్థానం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆమె తమిళంలో రివాల్వర్ రీటా చేస్తున్నారు. తొలిసారిగా బాలీవుడ్‌లో వరుణ్ ధావన్‌తో కలిసి ‘బేబీ జాన్’ అనే మరో సినిమా పూర్తి చేశారు. ఈ సినిమా డిసెంబర్‌ 25న విడుదల కాబోతోంది. కీర్తి సురేష్ తమ పెళ్ళి ఫోటోలు తన ఇన్‌స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకున్నారు.      



Related Post