బిఆర్ఎస్ పార్టీ డీపీగా తెలంగాణ తల్లి

December 12, 2024


img

తెలంగాణ తల్లి విగ్రహం మార్చడాన్ని బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఎంతగా అంటే, తాము అధికారంలోకి వస్తే ఆ విగ్రహాన్ని తొలగించి మళ్ళీ పాత రూపురేఖలతో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ ఏర్పాటు చేస్తామని కేటీఆర్‌ చెపుతున్నారు.

రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదని కాంగ్రెస్‌ తల్లి అని ఆ విగ్రహం తమకు ఆమోదయోగ్యం కాదని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. తమ అభిప్రాయలు, వాదనలకు మద్దతుగా సోషల్ మీడియాలో బిఆర్ఎస్ పార్టీ అధికారిక ఖాతాతో సహా కేటీఆర్‌, తదితరులు తమ డీపీలో తెలంగాణ తల్లి ఫోటోని పెట్టుకున్నారు. 

లగచర్ల గొడవలలో అరెస్ట్ అయ్యి పరిగి జైల్లో గిరిజన రైతు వీర్యా నాయక్‌కు గుండెపోటు వచ్చినప్పుడు జైలు సిబ్బంది అతని చేతులకు బేడీలు వేసి ఆస్పత్రిలోకి నడిపించుకుంటూ తీసుకువెళ్ళడంపై బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్‌ తీవ్రంగా స్పందించారు. 

గుండెపోటు వచ్చిన ఆ రైతన్నని అంబులెన్సులో స్ట్రెచ్చర్ మీద ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. కానీ అంతనేదో కరడుగట్టిన ఉగ్రవాది అన్నట్లు చేతులకు బేడీలు వేసి తీసుకువెళ్ళడం చాలా అమానుషం. ఇది అన్నదాతలని అవమానించడమే. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము,” ఆని కేటీఆర్‌ అన్నారు. 

ఈ ఘటనపై ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే..    


Related Post