లగచర్ల దాడి కేసులో అరెస్ట్ అయిన కొడంగల్‌కు చెందిన గిరిజన రైతు వీర్యా నాయక్‌కు పరిగి జైల్లో ఉండగా గుండెపోటు వచ్చింది. జైలు సిబ్బంది వెంటనే సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జైల్లో ప్రాధమిక చికిత్స చేసిన తర్వాత అతని చేతులకు బేడీలు వేసి ఆస్పత్రిలోకి నడిపించుకుంటూ తీసుకువెళ్ళడం విమర్శలకు తావిస్తోంది.
పరిగి జైలు లగచర్లకు సమీపంలో ఉండటంతో నిత్యం బాధిత కుటుంబాలు జైల్లో ఉన్న తమ వారిని కలుసుకునేందుకు వస్తూనే ఉన్నారు. కనుక వీర్యా నాయక్‌కు గుండె పోటు వచ్చిన విషయం బయటకు పొక్కకుండా రహస్యంగా ఉంచేందుకు జైలు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో లగచర్ల గ్రామంలో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అప్పుడే బిఆర్ఎస్ పార్టీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంకా స్పందించాల్సి ఉంది.
(video Courtecy: News Line Telugu)