ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈరోజు శాసనసభ ఆవరణలో మీడియా పాయింట్ వద్ద సరదాగా మాట్లాడుకున్నారు.
ముందుగా భట్టి విక్రమార్క మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశయించి “అన్నా బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పనులు జోరుగా సాగుతున్నాయి. అది పూర్తయితే నల్గొండ జిల్లా రూపురేఖలే మారిపోతాయి. అక్కడ నాకు ఓ ఎకరం స్థలం ఇప్పించావా?” అని సరదాగా అడిగారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ, “ఊకో అన్నా.. జిల్లా పర్యటనకి వచ్చినప్పుడు ప్రాజెక్ట్ కోసం నిధులు విడుదల చేయమంటే అలాగే అంటావు. సచివాలయనికి వచ్చి అడిగితే పైసల్లేవ్ అంటావు. ఆర్ధిక మంత్రిగా పని చేస్తున్నావు. కానీ పైసల్లేవ్ అంటే ఎట్లా?”అని అడిగారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న విమర్శలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ, “అసలు కేటీఆర్ ఎవరు? వాళ్ళ అయ్య కేసీఆర్ రాజకీయాలలో లేకుంటే కేటీఆర్ పేరు ఎవరికైనా తెలిసి ఉండేదా?
తండ్రి రాజకీయ పరపతితో నాయకుడుగా చలామణి అవుతున్న కేటీఆర్ భవిష్యత్‌లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా మేము పట్టించుకోము,” అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటుగా జవాబిచ్చారు.