దీక్షా దివస్ పేరుతో బిఆర్ఎస్ హడావుడి చేస్తుంటే..

November 29, 2024


img

 తెలంగాణ సాధన కోసం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ తన ప్రాణాలను పణంగా పెట్టి ఆనాడు ఆమరణ నిరాహార దీక్ష చేశారంటూ బిఆర్ఎస్ శ్రేణులు నేడు రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష దివస్ జరుపుకుంటుంటే, కాంగ్రెస్ పార్టీ (సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి సైన్యం) కేసీఆర్‌ దొంగ దీక్షలు చేశారంటూ ఓ వీడియో విడుదల చేసింది. 

నాడు కేసీఆర్‌కి పీఏగా పనిచేసిన కపిలవాయి దిలీప్ కుమార్ దానిలో మాట్లాడుతూ, “కేసీఆర్‌ 48 గంటలు నిరాహార దీక్ష చేయలేక మద్యలో ఇంటికి వెళ్ళి స్నానం చేసి చద్దన్నం తిని వచ్చేవారు. ఇక ఆమరణ నిరాహార దీక్ష చేయగలరంటే నమ్మశఖ్యంగా ఉందా?అని ప్రశ్నించారు. 

నాడు 48 గంటల దీక్ష మద్యలో కేసీఆర్‌ కనపడకపోతే ‘సార్ ఎక్కడికి వెళ్ళారని’ అడిగితే ఇంటికి వెళ్ళి వేన్నీళ్ళతో  స్నానం చేసి చద్దన్నం తినడానికి వెళ్ళారని ఆయన వ్యక్తిగత సహాయకులు చెప్పారు. ఆ దీక్ష మద్యలో చాలాసార్లు బాత్రూంలోకి వెళ్ళి లోపల పళ్ళ రసాలు త్రాగివచ్చేవారు. 

ఇక నీమ్స్ హాస్పిటలో కేసీఆర్‌ చేసిన ఆమరణ నిరాహార దీక్ష గురించి అందరికీ తెలిసిందే. ఆయన దీక్ష ఎలా సాగుతోందో చెప్పడానికి నీమ్స్ వైద్యులు సైతం భయపడేవారు,” అని కపిలవాయి దిలీప్ కుమార్ అన్నారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే.. 



Related Post