మంత్రి కొండా సురేఖకు ఇక తప్పదు

November 29, 2024


img

మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. నటుడు అక్కినేని నాగార్జున ఆమెపై వేసిన పరువునష్టం దావా కేసులో ఆమె స్వయంగా డిసెంబర్ 12న కోర్టు హాజరై వివరణ ఇచ్చుకోవాలని ఆదేశిస్తూ నోటీస్ పంపింది.

ఇంతవరకు ఆమె తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. కానీ ఇప్పుడు ఆమె స్వయంగా కోర్టుకి హాజరు కాక తప్పదు. మంత్రి హోదాలో ఉన్న ఆమె పరువు నష్టం కేసుని ఎదుర్కోవలసి వస్తుండటమే అవమానకరం కాగా ఇప్పుడు కోర్టుకి హాజరయ్యి వివరణ ఇచ్చుకోవాలసి వస్తుండటం ఇంకా అవమనకరమే అవుతుంది. కానీ తప్పదు. 

ఆమె గురించి బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టడంతో వాటిని ఆ పార్టీ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే పెట్టించారని భావిస్తూ, ఆయనకు మాదక ద్రవ్యాలు అలవాటు ఉందని, తెలుగు సినీ హీరోయిన్లని వేధించేవారని, వారిలో సమంత కూడా ఒకరంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్‌ ఒత్తిళ్ళు తట్టుకోలేక అక్కినేని కుటుంబం కూడా సమంతపై ఒత్తిడి చేసిందంటూ ఆమె నోరు జారారు.

కనుక అక్కినేని నాగార్జున, కేటీఆర్‌ ఇద్దరూ ఆమెపై చెరో వందకోట్లకు పరువు నష్టం దావాలు వేశారు. ఆమె వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున అభ్యంతరం చెప్పగా ఆమె వెంటనే క్షమాపణలు చెపుతూ ట్వీట్ చేశారు. కానీ ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలకు తప్పనిసరిగా ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలసిందేనని నాగార్జున తరపు న్యాయవాది నాంపల్లి కోర్టులో వాదించారు. ఆ కేసులోనే మంత్రి కొండా సురేఖ డిసెంబర్ 12న కోర్టుకు హాజరు కావలసి ఉంటుంది. 


Related Post