ఫుడ్ పాయిజనింగ్: మాకు అనుమానాలున్నాయి!

November 28, 2024


img

గత కొన్ని నెలలుగా తెలంగాణ ప్రభుత్వ, గురుకుల పాఠశాలలలో ఆహారం తిని విద్యార్ధులు అస్వస్థతకు గురవుతున్నారు. కొందరు చనిపోతున్నారు కూడా. హైకోర్టు కూడా “పిల్లలు చనిపోతే తప్ప పట్టించుకోదా?      అంటూ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది. ప్రతీ స్కూలులో కమిటీలు ఏర్పాటు చేసి ఆహారాన్ని, ముడి సరుకులను పరిశీలిస్తూ, ముందుగా వారు భోజనం రుచి చూసిన తర్వాతే పిల్లలకు వడ్డించాలని ఉత్తర్వులు జారీ చేసింది. 

కలుషిత ఆహారం తిని విద్యార్ధులు ఆస్పత్రుల పాలవుతుండటంపై మంత్రి సీతక్క మాట్లాడుతూ,” ప్రభుత్వ, గురుకుల పాఠశాలలలో తొలిసారిగా ఆహారం వండటం లేదు. అనేక ఏళ్ళుగా వండి వడ్డిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు హటాత్తుగా ఒకదాని తర్వాత మరో పాఠశాలలో ఆహారం కలుషితం అవుతుండటంపై మాకు అనుమానాలున్నాయి. 

మా ప్రభుత్వంపై బురద జల్లి అప్రదిష్ట పాలుచేసేందుకు దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని భావిస్తున్నాము. కనుక పూర్తి సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత వాటితో మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఈ కుట్రలను, వాటి వెనుక ఎవరెవరున్నారో అన్నీ బయటపెడతాను. దోషులుగా తేలినవారు ఎంత పెద్దవారైన విడిచి పెట్టే ప్రసక్తే లేదు,” అని మంత్రి సీతక్క హెచ్చరించారు.


Related Post