మూసీ ప్రక్షాళనకి హైకోర్టు లైన్ క్లియర్

November 27, 2024


img

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చాలా ఉపశమనం లభించింది. మూసీ ప్రక్షాళన విషయంలో ప్రభుత్వం ముందుకు సాగేందుకు హైకోర్టు అనుమతిం చింది. మూసీ పరీవాహక ప్రాంతాలలో నివాసాలను ఖాళీ చేయించి, ప్రక్షాళన చేపట్టాలని హైకోర్టు సూచించింది. 

మూసీ పరీవాహక ప్రాంతాలలో తాత్కాలిక, అనధికారిక నిర్మాణాలన్నీటినీ నిర్ధిష్ట గడువులోగా తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. తొలగింపు విషయంలో అధికారులు తప్పనిసరిగా నిబందనలు పాటించాలి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.   

మూసీ నివాసితులు లేదా వారి తరపున వేరేవరైన వేసే దిగువ కోర్టులలో పిటిషన్లు వేసిననట్లయితే ఉత్తర్వులు జారీ చేసేటప్పుడు 2023 మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్‌ వర్సస్ ఫిలోమెనా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా కేసులో ఇదే హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు సూచించింది. 

నిర్వాసితులలో పట్టా, శిఖం భూములున్నవారు ఉంటే వారికి ముందస్తు సమాచారం, చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించకనే వారి భూములు సేకరించాలి. పేదలకు వేరే ప్రాంతాలలో నివాసయోగ్యమైన ఇళ్ళు ఇవ్వాలి. 

ఎఫ్‌టీఎఫ్‌, బఫర్ జోన్ ఆక్రమణదారులపై ఇరిగేషన్, వాల్టా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. అలాగే ఎఫ్‌టీఎఫ్‌, బఫర్ జోన్ సర్వేకు ఎవరూ అడ్డుపడకూడదు. సర్వే సిబ్బందికి పోలీసులు భద్రత కల్పించాలి అని హైకోర్టు తీర్పులో పేర్కొంది. 

మూసీ ప్రక్షాళన విషయంలో బీజేపి, బిఆర్ఎస్ పార్టీలు చేస్తున్న రాజకీయాలతో ప్రభుత్వం చాలా ఇబ్బంది పడుతోంది. కనుక హైకోర్టు తాజా తీర్పు ప్రభుత్వానికి చాలా ఉపశమనం కలిగించడమే కాక ఇకపై చురుకుగా మూసీ ప్రాంతాలను ఖాళీ చేయించేందుకు మార్గం సుగమం అయ్యింది. ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని అడ్డుకునే సాహసం చేయలేవు. 


Related Post