ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ పెద్ద ట్వీటేశారుగా!

November 23, 2024


img

మహారాష్ట్ర, ఝార్ఖండ్ఎన్నికల ఫలితాలపై బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ ఎప్పటికైనా ప్రాంతీయ పార్టీలే దేశ భవిష్యత్ కు పునాదిగా నిలుస్తాయని నిరూపించాయన్నారు.మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని, ఝార్ఖండ్ రాష్ట్రంలో బీజేపిని ప్రజలు తిరస్కరించారని అన్నారు.

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్రలో ఎన్నిసార్లు చక్కర్లు కొట్టివచ్చినా, ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పినా, ఎన్ని మూటలు మోసుకువెళ్ళినా మారాఠీ ప్రజలు ఛీ  కొట్టి కాంగ్రెస్ పార్టీని ఓడించారని కేటీఆర్ అన్నారు.

దేశంలో బీజేపికి బలమైన ప్రతిపక్షంగా కూడా నిలవలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాలలో ప్రాంతీయపార్టీలను నాశనం చేస్తోందన్నారు. కాంగ్రెస్, బీజేపిలు రెండూ దేశంలో మరే ప్రాంతీయ పార్టీ నిలద్రొక్కుకోనీయకుండా రాజకీయాలు చేస్తూ అడ్డు పడుతున్నాయని కేటీఆర్ అన్నారు.

ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి చెంపదెబ్బ వంటివని, కనుక ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో పేరుకుపోయిన సమస్యలు, అభివృద్ధి, ఎన్నికల హామీల అమలుపై దృష్టి పెట్టి పనిచేస్తే మంచిదని కేటీఆర్ హితవు పలికారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే..              



Related Post