ఒకప్పుడు బండ్ల గణేశ్ సినిమాలలో హాస్య పాత్రలు చేస్తూ మంచిపేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత అకస్మాత్తుగా పెద్ద నిర్మాతగా మారిపోయి పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేశారు. ఆ తర్వాత రాజకీయాలలో చెయ్యిపెట్టి చెయ్యి కాల్చుకున్నారు. అయినా రాజకీయాలు వీడలేదు అలాగని రాజకీయాలలో తిరగడం లేదు. కాంగ్రెస్ తరపున సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఏదో ఒకటి చెపుతుంటారు.
శుక్రవారం తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అభినందనలు తెలుపుతూ, “గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. “టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావలెను,” అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. “టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావలెను”.🙏 @revanth_anumula anna @TelanganaCMO
— BANDLA GANESH. (@ganeshbandla) November 9, 2024