ఏపీలో ప్రభుత్వం మారడంతో ఇదివరకు జగన్ అండ చూసుకొని రెచ్చిపోయి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, ఏపీ హోంమంత్రి అనిత, వారి ఇంట్లో మహిళలపై అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ, అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు పెట్టేవారు.
వైసీపి ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కూడా వారు జోరు ఏమాత్రం తగ్గకపోగా ఇంకా రెచ్చిపోసాగారు. దీంతో సహనం నశించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గట్టిగా హెచ్చరించడంతో వారందరిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.
వారిలో నటి, శ్రీరెడ్డి కూడా. ఇదివరకు ఆమె కూడా వారిపై చాలా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు. కానీ ఇప్పుడు జైలుకి వెళ్ళే పరిస్థితి రావడంతో ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు.
దానిలో ఆమె రెండు చేతులు జోడించి తాను చాలా తప్పుగా వ్యవహరించానని చెపుతూ వారు ముగ్గురికీ, వారి కుటుంబ సభ్యులకు కూడా క్షమాపణలు చెప్పుకుంటున్నారు. కనుక పెద్దమనసుతో తన తప్పులను క్షమించాలని ఆమె అర్ధించారు.
ఇకపై తాను ఎన్నడూ వారి గురించి కానీ వారి కుటుంబాల గురించి గానీ సోషల్ మీడియాలో ఎటువంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టనని శ్రీరెడ్డి చెప్పారు. ఆమె ఏమన్నారో ఆమె మాటల్లోనే....