మల్లారెడ్డికి ఈడీ నోటీసులు... పీజీ సీట్లు అమ్ముకున్నారట!

November 08, 2024


img

మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఈడీ నోటీస్‌ జారీ చేసింది. ఆయన కుటుంబానికి చెందిన మెడికల్ కాలేజీలో పీజీ సీట్లను అక్రమంగా అమ్ముకున్నారనే ఆరోపిస్తూ విచారణకు హాజరయ్యి వివరణ ఇవ్వాలని నోటీసు పంపింది. ఆయన తరపున మల్లారెడ్డి కాలేజీల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి నిన్న హైదరాబాద్‌లో ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. 

గత ఏడాది జూన్ నెలలో ఈడీ ఆయన ఇళ్ళు, కాలేజీలలో సోదాలు నిర్వహించింది. ఆ తర్వాత తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు ఆదాయపన్ను శాఖ అధికారులు కూడా సోదాలు నిర్వహించి కొన్ని కీలకపత్రాలను స్వాధీనం చేసుకొని, మల్లారెడ్డి కాలేజీలలో విద్యార్దుల నుంచి అక్రమంగా సుమారు వంద కోట్లు వసూలు చేశారని ఆరోపించిన సంగతి తెలిసిందే. 

మల్లారెడ్డి కాలేజీతో సహా తెలంగాణలో 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో 45 సీట్లను బ్లాక్ చేసి విద్యార్దుల నుంచి  భారీగా డబ్బు వసూలు చేసి అమ్ముకున్నారని ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈడీ అధికారులు వాటిలో కూడా సోదాలు చేశారు. అవన్నీ కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీ నాయకులకు చెందినవే. ముందుగా మల్లారెడ్డి కాలేజీకి నోటీస్‌ ఇచ్చి వివరణ తీసుకున్నారు. మిగిలినవాటికి ఎప్పుడో?


Related Post