నల్గొండలో కొత్తగా టౌన్‌షిప్ నిర్మాణం

November 07, 2024


img

నల్గొండ జిల్లాలో యాదాద్రి విద్యుత్ కేంద్రంలో పనిచేసే ఉద్యోగుల కోసం కొత్తగా టౌన్‌షిప్ నిర్మించేందుకు జెన్‌కో టెండర్లు పిలిచింది. జిల్లాలో కృష్ణానది తుంగపాడు వాగులో కలిసే ప్రదేశంలో ఈ టౌన్‌షిప్ నిర్మించబోతోంది. 3,52,771.02 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించబోయే ఈ టౌన్‌షిప్ కోసం రూ.982.52 కోట్లు ఖర్చు చేయబోతోంది. ఈ నెల 16 నుంచి డిసెంబర్‌ 2వరకు బిడ్లను స్వీకరిస్తుంది. వచ్చే నెల 3న టెక్నికల్ బిడ్స్, 7వ తేదీన ప్రైసింగ్ బిడ్స్ తెరిచి టెండర్లు ఖరారు చేయనుంది. ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థలు 30 నెలల్లోగా టౌన్‌షిప్ నిర్మాణం పూర్తి చేసి అప్పగించాల్సి ఉంటుంది. 

ఈ టౌన్‌షిప్‌లో 2.22 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో అధికారులు, ఉద్యోగుల కోసం గృహాసముదాయాలు నిర్మిస్తారు. రోడ్లు, ఇతర సదుపాయాలకు 55.68 వేల చదరపు మీటర్లు, పార్కులు, పచ్చిక బయళ్ళు, చెట్లు పెంపకానికి 75.19 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంని కేటాయించబోతోంది. 

ఈ టౌన్‌షిప్‌లోనే మార్కెట్, అగ్నిమాపక కేంద్రం, క్లబ్ హౌస్, ఇండోర్ స్టేడియం, ఫంక్షన్‌లో హాలీవుడ్‌లో వగైరాలన్నీ నిర్మించబోతున్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌ 2025, మార్చినాటికి నిర్మాణపనులు పూర్తిచేసుకొని ఉత్పత్తి ప్రారంభించనుంది. కనుక ఆలోగా ఈ టౌన్‌షిప్‌ నిర్మాణం పూర్తిచేయాలని జెన్‌కొ లక్ష్యంగా పెట్టుకుంది.


Related Post