బాబూ మోహన్... మళ్ళీ టిడిపి గూటికి!

October 29, 2024


img

సినీ హాస్య నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ అనేక పార్టీలు మారిన తర్వాత మళ్ళీ టిడిపి గూటికి చేరుకున్నారు. టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుండటంతో బాబూ మోహన్ ఆందోల్ నియోజకవర్గంలో సభ్యత్వం తీసుకొని ఆ ఫోటోని మీడియాతో షేర్ చేశారు. 

బాబూ మోహన్ సినిమాలలో మంచి హాస్య నటుడుగా రాణించిన తర్వాత చాలా మందిలాగే ఆయన కూడా రాజకీయాలపట్ల ఆకర్షితులై  టిడిపిలో చేరి 1998లో ఆందోల్ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికలో పోటీ చేసి గెలిచారు.

ఆ తర్వాత 1999లో మరోసారి గెలిచి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రి అయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన ఉద్యమాలు జోరందుకోవడంతో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. 2004,2014లో కాంగ్రెస్‌ అభ్యర్ధి దామోదర రాజనర్సింహపై విజయం సాధించారు. కానీ ఆ తర్వాత పలు ఆరోపణలు, దురుసు ప్రవర్తన కారణంగా 2018లో కేసీఆర్‌ ఆయనకు టికెట్‌ నిర్మాకరించడంతో 2018లో బీజేపీలో చేరారు.

కానీ 2018, 2023 ఎన్నికలలో వరుసగా బిఆర్ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్ధుల చేతుల్లో ఓడిపోవడంతో బీజేపీకి రాజీనామా చేసి ఈ ఏడాది మార్చిలో కెఏ పాల్‌కి చెందిన ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ టిడిపి గూటికి చేరుకున్నారు. అంటే బాబూ మోహన్ ఎక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టారో మళ్ళీ అక్కడికే చేరుకున్నారన్న మాట! 


Related Post