తెలంగాణలో 470 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ

October 11, 2024


img

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో 371 పోస్టుల భర్తీకి శుక్రవారం మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్‌ జారీ చేసింది. గత నెలలో మొత్తం 2,050 నర్సింగ్ ఆఫీసర్స్ పోస్టులకు జారీ చేసిన నోటిఫికేషన్‌కి అనుబందంగా దీనిని విడుదల చేస్తున్నట్లు తెలిపింది.

వీటితో కలిపి మొత్తం 2,322 పోస్టులు భర్తీ చేయబోతున్నట్లు తెలిపింది. ఈ నెల 14వ తేదీలోగా నర్సింమ్గ్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని, నవంబర్‌ 17వ తేదీన ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తామని మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్‌లో తెలియజేసింది. 

దీంతో పాటు మరో అనుబండ నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. ఇదివరకు ప్రకటించిన నోటిఫికేషన్‌లో 633 ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు అదనంగా మరో 99 పోస్టులు కలిపి మొత్తం 732 పోస్టులు భర్తీ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ ఉద్యోగాలకు ఈ నెల 21వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, నవంబర్‌ 30వ ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొంది.


Related Post