రాజకీయాలలోకి షాయాజీ షిండే... ఏ పార్టీ అంటే...

October 11, 2024


img

ప్రముఖ తెలుగు, హిందీ, మరాఠీ సినిమా నటుడు షాయాజీ షిండే ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించారు. తన సొంత రాష్ట్రమైన మహారాష్ట్రలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముంబయిలోని ఆ పార్టీ కార్యాలయంలో దాని అధినేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌ శుక్రవారం షాయాజీ షిండేకి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 

వచ్చే ఏడాది మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. షాయాజీ షిండే ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటున్నారు. ఆయనకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని అజిత్ పవార్‌ చెప్పారు. తమ పార్టీకి షాయాజీ షిండే స్టార్ క్యాంపెయినర్‌గా ఉంటారని చెప్పారు. 

ఈ సందర్భంగా షాయాజీ షిండే మీడియాతో మాట్లాడుతూ, “నేను అనేక సినిమాలలో రాజకీయ నాయకుడుగా నటించాను. అందువల్లే రాజకీయాలపై కూడా నాకు ఆసక్తి పెరిగింది. అజిత్ పవార్‌ ఆలోచనలు, ఆశయాలు నాకు నచ్చాయి. అందుకే నా రాజకీయ ప్రవేశానికి ఆయన నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బాగుటుందని చేరాను. పార్టీ నాకు ఏ బాధ్యతలు అప్పగించినా సంతోషంగా చేస్తాను,” అని అన్నారు. 

రెండు రోజుల క్రితమే షాయాజీ షాయాజీ షిండే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ని కలిశారు. బహుశః ఇదే విషయం గురించి ఆయనతో చర్చించి సలహాలు తీసుకొని ఉండవచ్చు. 


Related Post