పవన్‌ కళ్యాణ్‌తో షాయాజీ షిండే భేటీ

October 09, 2024


img

ప్రముఖ నటుడు షాయాజీ షిండే నిన్న మంగళగిరి వెళ్ళి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. ఇంతకాలం సినీ పరిశ్రమలో కలిసి పనిచేసిన పవన్‌ కళ్యాణ్‌ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టినందున అభినందించేందుకు వచ్చి కలిశానని షిండే చెప్పారు.

తమ మద్య ఎటువంటి రాజకీయ చర్చలు జరుగలేదని, తనకు కూడా పవన్‌ కళ్యాణ్‌లాగే ప్రకృతి పరిరక్షణ, సాహిత్యం చాలా ఆసక్తి ఉన్నందున వాటి గురించి, తాము చేస్తున్న సినిమాల గురించి మాత్రమే మాట్లాడుకున్నామని షిండే చెప్పారు.

తాను మరాఠీలో వ్రాసిన ఓ కవితని చదివి పవన్‌ కళ్యాణ్‌ వినిపించగా దానిని ఆయన శ్రద్దగా విని తెలుగులోకి అనువదించి చెప్పడం తనకు చాలా సంతోషం కలిగించిందని చెప్పారు. 

మహారాష్ట్రలో కొన్ని ప్రసిద్ద ఆలయాలలో భక్తులకు ప్రసాదంతో పాటు వృక్ష ప్రసాదం పేరుతో మొక్కలు పంపిణీ చేస్తుంటారని, అదే విధానాన్ని ఏపీ ఆలయాలలో కూడా అంలుచేస్తే బాగుంటుందని, దాని వలన రాష్ట్రంలో పచ్చదనం పెరుగుతుందని సూచించాని తాను చెప్పగా పవన్‌ కళ్యాణ్‌ సానుకూలంగా స్పందించారని షిండే చెప్పారు. సిఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఈ విధానాన్ని అమలుచేస్తామని చెప్పారన్నారు. 

నిజాయితీపరుడైన పవన్‌ కళ్యాణ్‌ ఏపీకి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నందున ఆయన వలన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని ఆశిస్తున్నానని షాయాజీ షిండే అన్నారు.


Related Post