మంత్రి కొండా సురేఖ తమ కుటుంబం ప్రతిష్ట దెబ్బ తీసేవిదంగా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నటుడు అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దానిపై సోమవారం నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున అభ్యంతరం తెలుపుతూ వాటిని వెనక్కు తీసుకోవలసిందిగా ట్వీట్ చేయగానే ఆమె వెనక్కు తీసుకున్నారని కనుక ఈ కేసు విచారణ అవసరం లేదని ఆమె తరపు న్యాయవాది వాదించారు.
అక్కినేని నాగార్జున తరపు సీనియర్ న్యాయవాది అశోక్ రెడ్డి వాదిస్తూ, మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నప్పటికీ వాటి వలన జరిగిన నష్టం మారదని కనుక ఆమెపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవలసి ఉందని వాదించారు.
ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత నేడు అక్కినేని నాగార్జున వాంగ్మూలం రికార్డ్ చేయాలని న్యాయస్థానం సూచించింది. దాని ఆదారంగా విచారణ జరుపుతామని తెలిపింది. కనుక నేడు అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టుకి హాజరవనున్నారు.
ఆమె వలన తమ కుటుంబ ప్రతిష్టకి భంగం కలిగిందని అక్కినేని నాగార్జున ఇదివరకే చెప్పారు. బహుశః మళ్ళీ అదే చెప్పవచ్చు. అదే చెప్తే ఆమెపై రూ.100 కోట్ల పరువు నష్టం దావాకు నాంపల్లి కోర్టు అనుమతించి విచారణ చెప్పట్టే అవకాశం ఉంటుంది.