చైతు-సమంత ఎందుకు విడిపోయారో చెప్పాలి: సురేఖ

October 04, 2024

img

మంత్రి కొండా సురేఖ మళ్ళీ మరోసారి మీడియా ముందుకు వచ్చి నాగ చైతన్య-సమంతల గురించి మాట్లాడారు. “నేను మాట్లాడింది తప్పే అనుకొందాము. కానీ నాగ చైతన్య-సమంత విడిపోయిన తర్వాత అక్కినేని కుటుంబంలో ఏ ఒక్కరూ వారు ఎందుకు విడిపోయారో చెప్పనేలేదు. ఎందువల్ల?

ఆ అమ్మాయి సమంత చెప్పుకోలేదు. కానీ నాగ చైతన్య లేదా అక్కినేని నాగార్జున వారు ఎందుకు విడిపోయారో చెప్పవచ్చు కానీ ఎందుకు చెప్పలేదు?

సినీ పరిశ్రమలో వారి ద్వారా నాకు తెలిసిన విషయం నేను బయటపెట్టాను. వాళ్ళు చెప్పలేదు కనుకనే నేను నాకు తెలిసిన విషయం చెప్పాను. అందుకు నేను భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు నా ప్రశ్నకి సమాధానం చెప్పే వరకు మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటాను,”  అని అన్నారు.

తన మాటలు వెనక్కు తీసుకొని సమంతకి క్షమాపణలు చెప్పుకొన్నందున కొండా సురేఖ వెనక్కు తగ్గారని అందరూ అనుకుంటుంటే, ఆమె మళ్ళీ ఈవిదంగా మాట్లాడటం నిప్పు రాజేసిన్నట్లయింది. కనుక టాలీవుడ్‌ హీరోలు అందరూ మళ్ళీ ఆమెపై ట్వీట్‌ బాణాలు సందిస్తారా? ఈసారి సైలంట్ అయిపోతారా? మరికొద్ది సేపటిలోనే తెలుస్తుంది.

వాళ్ళెందుకు విడిపోయారో నీకెందుకు చెప్పాలి? అది వాళ్ళ personal issue. వేరేవాళ్ళ వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడం తప్పని కూడా తెలియదు ఈ మాజీ నక్సలైట్ కి 🤦🏻‍♂️ #KondaSurekha #KondaSurekhaNeedToApologize https://t.co/Wvjoi9hap2
— H K (@tweetsbyhk) October 4, 2024

(వీడియో: డైలీ కల్చర్ సౌజన్యంతో)

Related Post