మంత్రి కొండా సురేఖ నేడు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, “కేటీఆర్ తెలుగు సినీ పరిశ్రమలో పలువురు హీరోయిన్ల జీవితాలతో ఆటలాడుకునేవారు.
ఆయన రేవ్ పార్టీలు నిర్వహించేవారు. స్వయంగా మాదక ద్రవ్యాలు సేవిస్తూ వాటిని హీరోయిన్లకు కూడా అలవాటు చేసేవారు. నాగ చైతన్య, సమంత దంపతులు విడిపోవడానికి కేటీఆరే కారణం. సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోవడానికి కూడా కేటీఆరే కారణం. ఈ విషయం సినీ పరిశ్రమలో ఉన్నవారందరికీ తెలుసు,” అని సంచలన ఆరోపణలు చేశారు.
పెళ్ళిలో వధూవరులు పరస్పరం దండలు మార్చుకున్నట్లుగా మంత్రి కొండా సురేఖ మెడలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు దండవేస్తున్నట్లు ఓ ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ సందర్భంలో తీసిన ఫోటో అది.
అయితే దీనిని తనను అవమానించాలనే దురుదేశ్యంతో కేటీఆరే దీనిని తన అనుచరులతో పోస్ట్ చేయించారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.
మహిళల పట్ల కేటీఆర్‌కి గౌరవం లేదని ఇది స్పష్టం చేస్తోందని చెపుతూ, నాగ చైతన్య-సమంతల విడాకుల వ్యవహారం గురించి మాట్లాడారు. కొండా సురేఖ చేసిన ఆరోపణలు ఏమీ ఆషామాషీవి కావు. కనుక ఇప్పుడు కేటీఆర్ ఏవిదంగా స్పందిస్తారో? నాగ చైతన్య-సమంత కూడా స్పందిస్తారో లేదో చూడాలి.