హైడ్రాకి గవర్నర్‌ గ్రీన్ సిగ్నల్‌

October 02, 2024


img

హైడ్రా కూల్చివేతలపై సర్వత్రా విమర్శలు, నిరసనలు వెల్లువెత్తుతుంటే, హైకోర్టు కూడా అక్షింతలు వేస్తుంటే, హైడ్రాకి చట్టబద్దత, సర్వాధికారాలు దఖలు పరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ మీద గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ నేడు సంతకం చేసి ఆమోదముద్ర వేశారు. త్వరలోనే శాసనసభ సమావేశాలలో దీనికి సంబందించిన బిల్లు ప్రవేశపెట్టి ఆమోదిస్తే హైడ్రాకు ఇక తిరుగు ఉండదు. 

ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాకి చట్టబద్దత, సర్వాధికారాలు దాఖలు పడ్డాయి కనుక న్యాయ వివాదాలు ఏర్పడినప్పుడు రాజ్యాంగపరమైన రక్షణ ఏర్పడుతుంది. కనుక న్యాయస్థానాలు హైడ్రా నిర్ణయాలు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తప్ప దానిని తప్పు పట్టలేవు. 

రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పరిధిని అవుటర్ రింగ్ రోడ్డు వరకు పెంచింది. కనుక హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో అన్ని ప్రాంతాలు హైడ్రా పరిధిలోకి వచ్చిన్నట్లయింది. 

జీహెచ్‌ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 374బి ప్రకారం ఆక్రమణలను పరిశీలించడానికి, నోటీసులు ఇచ్చి కూల్చివేయడానికి హైడ్రాకి అధికారాలు కలిగాయి.


Related Post