పూణేలో హెలికాఫ్టర్‌ కూలి ముగ్గురు మృతి

October 02, 2024


img

బుధవారం ఉదయం 6.45 గంటలకు మహారాష్ట్రలోని పూణేలో హెలికాఫ్టర్‌ కూలిపోయింది. ఈ ప్రమాదంలో  పైలట్, మరో ఇద్దరు మృతి చెందారు. ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేట్ హెలికాఫ్టర్‌ సంస్థకి చెందిన హెలికాఫ్టర్‌, ఈరోజు ఉదయం పూణేలోని ఆక్స్ ఫర్డ్ గోల్ఫ్ క్లబ్‌లోగల హెలీపాడ్ నుంచి ముంబైలోని జూహూకి బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్ది సేపటికే హెలికాఫ్టర్‌ పూణే నగరం శివారులో బవ్ధాన్ కొండల ప్రాంతాలలో కుప్ప కూలిపోయింది.

 హెలికాఫ్టర్‌ కూలిపోగానే మంటలు అంటుకొని వ్యాపించడంతో దానిలో ఉన్న ముగ్గురూ తప్పించుకునే అవకాశం లేకుండాపోయింది. దట్టమైన పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగిన్నట్లు తెలుస్తోంది. సమాచారం అండగానే జిల్లా పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. కానీ అప్పటికే హెలికాఫ్టర్‌, దానిలో ఉన్న ముగ్గురూ కాలి బూడిదయి పోయారు.


Related Post