నేడు గాంధీ జయంతి. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్వర్యంలో కాంగ్రెస్ మంత్రులు, ముఖ్య నేతలు ఈరోజు ఉదయం 10.30 గంటలకు గాంధీ భవన్‌లో మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పూలువేసి నివాళులు ఆర్పిస్తారు.
అనంతరం ఉదయం 11 గంటలకు గాంధీ భవన్‌లోనే కాంగ్రెస్ సేవా దళ్ అధ్యక్షుడు జితేందర్ అధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 11.30 గంటలకు రెనోవా హాస్పిటల్లో సామాన్య ప్రజలకి ఉచితంగా వైద్య పరీక్షలు, గుండె సంబందిత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలలో పాల్గొనవలసిందిగా మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ కార్యకర్తలకు, నగర ప్రజలకు పిలుపునిచ్చారు.