తెలంగాణ మహిళలు ఎంతో భక్తి శ్రద్దలతో తొమ్మిది రోజులపాటు జరుపుకునే పూల పండుగ బతుకమ్మ నేటి నుంచి మొదలవుతుంది. తొలిరోజున ఎంగిలిపూల బతుకమ్మతో మొదలుపెట్టి తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మ నిమజ్జనంతో ముగుస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ రవీంద్ర భారతిలో నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు సాంస్కృతిక కళా ప్రదర్శనలు నిర్వహించబోతోంది.
ఈ నెల 10వ తేదీన సద్దుల బతుకమ్మ ముగింపు వేడుకలలో 1,000 బతుకమ్మలతో వెయ్యి మంది జానపద, గిరిజన కళాకారులతో అమరవీరుల స్తూపం వద్ద కళా ప్రదర్శనలు, బతుకమ్మ ఆట పాటలు నిర్వహించనుంది.
ఆ రోజు సాయంత్రం 7 గంటలకు సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తదితరుల సమక్షంలో ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ పూజ, కళా ప్రదర్శన, నిమజ్జనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. తొమ్మిది రోజులపాటు రవీంద్ర భారతిలో సాగే సంస్కృతిక ప్రదర్శన వివరాలను తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేసింది. ఆ వివరాలు: