తెలంగాణకు కేంద్రం వరద సాయం రూ.416.80 కోట్లు

October 01, 2024


img

కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో సహా దేశంలో వరద ప్రభావిత రాష్ట్రాలన్నిటికీ కలిపి నేడు రూ.5,858.60 కోట్లు విడుదల చేసింది. దానిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రూ.1,036 కోట్లు తెలంగాణకి రూ.416.80 కోట్లు నిధులు విడుదల చేసింది. 

రాష్ట్ర విపత్తు నిధిలో కేంద్ర ప్రభుత్వం వాటా, అదేవిదంగా కేంద్ర ప్రభుత్వ విపత్తు నిధి నుంచి కలిపి మొత్తం 14 రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ నిద్ధులు విడుదల చేసింది.   

మహారాష్ట్రకు అత్యధికంగా రూ.1,492 కోట్లు కేటాయించగా అస్సాం రూ.716 కోట్లు, బిహార్‌ రూ.655.60 కోట్లు, గుజరాత్‌ రూ.600 కోట్లు, పశ్చిమ బెంగాల్ రూ. 468 కోట్లు, హిమాచల్ ప్రదేశ్ రూ.189.20 కోట్లు, కేరళ రూ.145.60 కోట్లు, మణిపూర్ రూ.50 కోట్లు, మిజోరాం రూ.21.60 కోట్లు, నాగాలాండ్ రూ.19.20 కోట్లు, సిక్కిం రూ.23.60 కోట్లు కేటాయిస్తూ నేడు ఉత్తర్వులు జారీచేసింది. 

తెలంగాణలో సుమారు రూ.5-7,000 కోట్ల వరకు నష్టం జరిగిన్నట్లు అంచనా వేసి కనీసం రూ.5,000 కోట్లు ఆర్ధిక సాయం కోరగా కేవలం రూ. 416.80 కోట్లు మాత్రమే ఇచ్చింది.

దేశంలో అత్యధిక పన్ను వసూళ్లు చేసి కేంద్రానికి అందిస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ ముందుంది. కానీ తెలంగాణకి కష్టం వచ్చినప్పుడు మొక్కుబడిగా నిధులు విడుదల చేసింది.


Related Post