కేబీఆర్ పార్క్ చుట్టూ 6 జంక్షన్స్ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్‌

September 29, 2024


img

హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.826 కోట్లతో పార్క్ చుట్టూ ఆరు జంక్షన్లని అభివృద్ధి చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ పనులను రెండు ప్యాకేజీలు విభజించి చేపట్టబోతోంది. 

మొదటి ప్యాకేజీలో భాగంగా రెండు ఫ్లైఓవర్లు, మూడు అండర్ పాస్ రోడ్లు నిర్మించనున్నారు. అది పూర్తయిన తర్వాత రెండో ప్యాకేజీలో మరో 4 ఫ్లైఓవర్లు, 4 అండర్ పాస్ రోడ్లు నిర్మించనున్నారు. 

ఈ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ రోడ్లు పూర్తయ్యి వినియోగంలోకి వస్తే యూసఫ్ గూడ, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ మద్య నిత్యం ప్రయాణించేవారికి ట్రాఫిక్ కష్టాలు తీరిపోతాయి. వీటికి సంబందించిన నమూనా చిత్రాలను జీహెచ్‌ఎంసీ సోషల్ మీడియాలో ప్రజలతో షేర్ చేసింది. 

<blockquote class="twitter-tweet"><p lang="te" dir="ltr"><a href="https://twitter.com/hashtag/KBR?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#KBR</a> పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు. హైదరాబాద్ కేబీఆర్ పార్కు చుట్టూ రూ.826 కోట్లతో 6 జంక్షన్లను ప్రభుత్వం నిర్మించనుంది. రెండు ప్యాకేజీలుగా నిర్మించే ఈ ప్రాజెక్ట్ మొదటిగా 2 ఫ్లైఓవర్లు, 3 అండర్ పాస్ లు, సెకండ్ ప్యాకేజీలో 4 ఫ్లైఓవర్లు, 4 అండర్ పాస్ లు అభివృద్ధి చేయనుంది.… <a href="https://t.co/kFmuIrRCTr">pic.twitter.com/kFmuIrRCTr</a></p>&mdash; GHMC (@GHMCOnline) <a href="https://twitter.com/GHMCOnline/status/1840262100226130183?ref_src=twsrc%5Etfw">September 29, 2024</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>



Related Post