హైదరాబాద్, హుస్సేన్ సాగర్‌లో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు గణేశ్ నిమజ్జనాలు జరుగబోతున్నాయి. కనుక నగరం నలుమూలల నుంచి గణేశ్ నిమజ్జణాలలో పాల్గొనేందుకు వేలాదిమంది ప్రజలు ట్యాంక్ వస్తారు.
కనుక ఆరోజు రాత్రి 2 గంటల వరకు అన్ని మార్గాలలో మెట్రో రైళ్ళు నడిపించబోతున్నట్లు హైదరాబాద్ మెట్రో సంస్థ ప్రకటించింది. రాత్రి ఒంటి గంటకు చివరి మెట్రో బయలుదేరి 2 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని మెట్రో అధికారులు తెలిపారు. కనుక ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
శనివారం నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో నిన్న ఒక్కరోజే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ గుండా 94,000 భక్తులు రాకపోకలు సాగించారని తెలిపారు. ఈరోజు ఆదివారం కూడా ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌తో సహా పలు స్టేషన్లలో ప్రయాణికులతో కిటకిటలాడిపోయాయి.
మెట్రో ఎంత రద్దీగా సమయానికి వచ్చి త్వరగా గమ్యస్థానానికి చేర్చుతుండటం, అడపాదడపా వర్షాలతో ఇబ్బంది కారణంగా అందరూ మెట్రోలోనే ప్రయాణిస్తున్నారు. గణేశ్ నిమజ్జనాలు పూర్తయ్యేవరకు ఈ రద్దీ ఇలాగే ఉంటుంది.