ఎట్టకేలకు కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవానికి సిద్దం

September 06, 2024


img

తెలంగాణ ప్రజలే కాదు యావత్ తెలుగు జాతి గర్వించదగ్గ కవి కాళోజీ నారాయణ రావు. తెలంగాణ ఏర్పడగానే ఆయనకు సముచితం గౌరవం కల్పించాలనే సదుదేశ్యంతో కేసీఆర్‌ హనుమకొండలోనిఓ హయగ్రీవాచారి మైదానంలో 2014లో కాళోజీ కళాక్షేత్రానికి పునాదిరాయి వేశారు. 

అయితే ఆ తర్వాత ఎప్పుడో మొదలుపెట్టిన ప్రగతి భవన్, సచివాలయం, సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల నిర్మాణాలు పూర్తయ్యాయి గానీ కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం మాత్రం పూర్తికాలేదు. చివరికి కేసీఆర్‌ దిగిపోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిగిలిన పనులను శరవేగంగా పూర్తిచేయించి ప్రారంభోత్సవానికి సిద్దం చేసింది.

ఈనెల 9న కాళోజీ జయంతి రోజున ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కాళోజీ కళాక్షేత్రానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. భవనం ఎదుట ఆహ్లాదకరమైన ఉద్యానవనం దానిలో కాళోజీ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. 

రూ.95 కోట్ల వ్యయంతో 4.2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కాళోజీ కళాక్షేత్రాన్ని రెండు అంతస్తులలో నిర్మించారు. దీనిలో సాంస్కృతిక ప్రదర్శనలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా 1500 మంది కూర్చోగల అతి పెద్ద ఆడిటోరియం సినిమా థియేటర్లలో ఉండే అంత పెద్ద తెర ఉంది. అత్యాధునిక సౌండ్ అండ్ లైటింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. 

మొదటి అంతస్తులో ఆర్ట్ గ్యాలరీ, రిహార్సల్, మేకప్ వంటి సన్నాహకాల కోసం విశాలమైన హాల్, అత్యాధునిక సదుపాయాలతో విశాలమైన వంట గది, కాళోజీ వాడిన వస్తువులతో ఓ గ్యాలరీ ఉన్నాయి.


Related Post