నాగ చైతన్యకి సమంత రిటర్న్ గిఫ్ట్ రెడీ?

August 15, 2024


img

ఇటీవల నాగ చైతన్య, శోభిత ధూళిపాళల వివాహ నిశ్చితార్ధ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఆ మర్నాటి నుంచే సమంత గురించి ఓ కొత్త వార్త మీడియాలో కనిపిస్తోంది. అదే... ఆమె కూడా ప్రేమలో పడిందని!

ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ, సిటాడెల్ వంటి వెబ్‌ సిరీస్‌తో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డికె. వారి దర్శకత్వంలో ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌ సిరీస్‌లో సమంత కీలకపాత్ర చేసింది. అప్పుడే ఆమె రాజ్‌ నిడిమోరుతో ప్రేమలో పడ్డారని, అప్పటి నుంచి వారి ప్రేమ కొనసాగుతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అవి నిజమో కావో తెలీదు కానీ నాగ చైతన్య-శోభిత ధూళిపాళల వివాహ నిశ్చితార్ధం జరిగిన మర్నాటి నుంచి సమంత-రాజ్‌ కొత్త ప్రేమ కధ వినిపిస్తుండటం గమనిస్తే నిప్పు లేనిదే పొగ రాదనుకోవలసి ఉంటుంది.

ఒకవేళ ఇది నిజమైతే బహుశః ఇది నాగ చైతన్యకి సమంత ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ అని భావించవచ్చు. అయితే సమంత, రాజ్ నిడుమోరు ఈ ఊహాగానాలపై ఇంకా స్పందించాల్సి ఉంది.  



Related Post