మళ్ళీ కాంగ్రెస్‌లో పదవుల లొల్లి షురూ!

August 14, 2024


img

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ పార్టీ నేతలు పదవుల కోసం కీచులాడుకుంటూనే ఉంటారు. అదే కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేకత. రేవంత్‌ రెడ్డి స్థానంలో పిసిసి అధ్యక్షుడి నియమించాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావించగానే పార్టీలో ఓ అరడజను మంది ఆ పదవికి పోటీ పడ్డారు. అలాగే మంత్రివర్గ విస్తరణ విషయంలో కూడా ఇలాగే జరిగింది. పదవుల కోసం నేతల ఒత్తిళ్ళు భరించలేక వాటిపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా పక్కన పెట్టేసింది. 

సిఎం రేవంత్‌ రెడ్డి ఇప్పుడు విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌ తిరిగి రావడంతో మళ్ళీ పదవుల కోసం పార్టీలో పోటీ మొదలైంది. 

మాజీ కేంద్ర సహాయమంత్రి, సీనియర్ కాంగ్రెస్‌ నాయకుడు, మహబూబాబాద్ ఎంపీ పి బలరాం నాయక్ మంగళవారం జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ, “నా అనుభవం, కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని నాకు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని మా అధిష్టానాన్ని కోరుతున్నాను.

ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలో వివిద సామాజిక వర్గాలకు పిసిసి అధ్యక్ష పదవి లభించింది కానీ గిరిజనులకు లభించలేదు. కనుక వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను,” అని అన్నారు.


Related Post