ఏసీబీ వలలో రంగారెడ్డి జాయింట్ కలెక్టర్‌!

August 13, 2024


img

తెలంగాణలో ఏసీబీ దాడులు చేసి ఎంతమందిని పట్టుకుంటున్నా లంచాలకు, అవినీతికి అలవాటు పడిన అధికారులు ఏమాత్రం భయపడటం లేదు. తాజాగా రంగారెడ్డి జాయింట్ కలెక్టర్‌ భూపాల్ రెడ్డి, కలెక్టరేట్‌లో సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి ఏసీబీ వలలో పడ్డారు. 

ధరణి పోర్టల్‌లో జిల్లాకు చెందిన ఓ వ్యక్తి భూమి పొరపాటున నిషేదిత జాబితాలో చేర్చబడింది. దాని కోసం అతను తన యాజమాన్యపు హక్కులకు సంబందించి డాక్యుమెంట్లని సమర్పించి దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆ నిషేదిత జాబితాలో నుంచి అతని భూమిని తొలగించేందుకు భూపాల్ రెడ్డి రూ.8 లక్షలు లంచం డిమాండ్ చేయసాగాడు.

 దాంతో ఆ వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన ప్రకారం భూపాల్ రెడ్డికి ఆ సొమ్ము ఇవ్వబోతే ఆయన తన సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి ద్వారా ఆ లంచం సొమ్ము తీసుకున్నారు. అప్పటికే కాపు కాసిన ఏసీబీ అధికారులు వారిద్దరినీ రెడ్ హ్యాండడ్‌గా పట్టుకున్నారు. 

తర్వాత వారు భూపాల్ రెడ్డిని ఇంటికి తీసుకువెళ్ళి ఆయన సమక్షంలోనే సోదాలు చేయగా ఇంట్లో మరో రూ.16 లక్షల నగదు, కొన్ని కీలక పత్రాలు లభించాయి. ఏసీబీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకొని వారిద్దరిపై కేసు నమోదు చేశారు. 


Related Post