రాజ్‌తరుణ్‌-లావణ్య కేసులో మరో ట్విస్ట్!

August 13, 2024


img

రాజ్‌తరుణ్‌-లావణ్య వ్యవహారంలో రోజుకో కొత్త విషయం బయటపడుతూనే ఉంది. మస్తాన్ సాయి  అనే వ్యక్తితో లావణ్యకు అక్రమ సంబంధం ఉందని, అతని ద్వారానే మాదక ద్రవ్యాలకు అలవాటు పడిందని రాజ్‌తరుణ్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారంలో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగానే మస్తాన్ సాయి హైదరాబాద్‌ నుండి గుంటూరు పారిపోయాడు. అయితే అతను గుంటూరులో కూడా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు పసిగట్టిన పోలీసులు అక్కడకు చేరుకుని వలపన్ని పట్టుకున్నారు.

మస్తాన్ సాయిని అరెస్ట్ చేసి హైదరాబాద్‌ తరలించి విచారించగా వారికి అనేక కొత్త విషయాలు తెలిశాయి. మస్తాన్ సాయి కేవలం డ్రగ్స్ బిజినెస్‌ చేస్తూనే మహిళలకు వాటిని అలవాటు చేసేవాడని, వారు మత్తులో ఉన్నప్పుడు నగ్నంగా ఫోటోలు వీడియోలు తీసి వాటితో వారిని బ్లాక్ మెయిల్ చేస్తుంటాడని పోలీసులు కనుగొన్నారు.

అతని మొబైల్ ఫోన్‌లో ఆంధ్రా, తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన చాలా మంది అమ్మాయిల ఫోటోలు, వీడియోలు, వారి కాంటాక్ట్ నంబర్లను పోలీసులు గుర్తించారు. మస్తాన్ సాయికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చేవి? వాటిని హైదరాబాద్‌లో ఎవరెవరికి, ఏవిదంగా సరఫరా చేసేవాడు? వగైరా వివరాలు రాబడుతున్నారు. రాజ్‌తరుణ్‌-లావణ్యల వ్యవహారంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు  డ్రగ్ సప్లయర్ మస్తాన్ సాయి పట్టుబడటం విశేషం.


Related Post