సియోల్ నది స్పూర్తితో మూసీనది సుందరీకరణ

August 13, 2024


img

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హైదరాబాద్‌లోని మూసీనదిని ప్రక్షాళన చేసి సుందరీకరిస్తామని చెపుతూనే ఉంది. రాష్ట్ర బడ్జెట్‌లో దాని కోసం రూ.100 కోట్లు కేటాయించింది కూడా.

సిఎం రేవంత్‌ రెడ్డి బృందం మంగళవారం రాత్రి దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరం మద్యగా ప్రవహిస్తున్న చియోంగ్‌చియాన్ నదిని, దానిని సుందరీకరణ చేసిన విధానాన్ని పరిశీలించారు. ఒకప్పుడు అది కూడా మూసీనది లాగే చాలా కలుషితమై దుర్గంధం వెదజల్లుతూ ఉండేది. దానిని దక్షిణ కొరియా ప్రభుత్వం సమూలంగా ప్రక్షాళన చేసి అత్యద్బుతంగా తీర్చి దిద్దడంతో ఇప్పుడు అదో పెద్ద పర్యాటక ఆకర్షణ కేంద్రంగా మారిపోయింది. 

అదే స్పూర్తితో హైదరాబాద్‌లో మూసీ నదిని కూడా తెలంగాణ ప్రభుత్వం తీర్చిదిద్దబోతోందని సీఎంవో ట్వీట్‌ చేస్తూ, సిఎం రేవంత్‌ రెడ్డి బృందం అక్కడ పర్యటిస్తున్నప్పుడు తీసిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మూసీ నదిని కూడా అంత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దబోతోందని తెలియజేసింది. 


Related Post