అమెరికా పర్యటనతో తెలంగాణకు రూ.31,352 కోట్లు పెట్టుబడులు

August 12, 2024


img

సిఎం రేవంత్‌ రెడ్డి బృందం పది రోజుల అమెరికా పర్యటన ముగించుకుని దక్షిణ కొరియా రాజధాని సియోల్ చేరుకున్నారు. అక్కడ కొరియా టెక్స్‌టైల్ సమాఖ్య ప్రతినిధులతో సమావేశమయ్యి వరంగల్‌ మెగా టెక్స్‌టైల్ పార్కులో కల్పించిన సౌకర్యాలు, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు, వ్యాపార అవకాశాలు వగైరా వివరించారు. సిఎం రేవంత్‌ రెడ్డి బృందం ఆహ్వానం మేరకు వారు త్వరలో తెలంగాణలో పర్యటించి పరిశ్రమల ఏర్పాటుకి గల అవకాశాలను స్వయంగా చూస్తామని చెప్పారు. 

సిఎం రేవంత్‌ రెడ్డి బృంద ఎల్‌జీ అనుబంద సంస్థ ఎల్‌ఎస్‌ సంస్థ ప్రతినిధులతో కూడా సమావేశమయ్యింది. వారు కూడా తెలంగాణలో పర్యటించి గ్యాస్, వాహనాల బ్యాటరీలు, విద్యుత్ కేబుల్స్ తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు గల అవకాశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. 

సిఎం రేవంత్‌ రెడ్డి బృందం 8 రోజుల అమెరికా పర్యటన విజ్యవంతమైందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పర్యటనలో 50 సంస్థల ప్రతినిధులతో సమావేశం కాగా వాటిలో 19 సంస్థలు ఫార్మా, విద్యుత్ వాహనాలు, ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్, ఐ‌టి, ఎలక్ట్రానిక్స్, డాటా సెంటర్‌, లైఫ్ సైన్సస్ రంగాలలో మొత్తం రూ.31,532 కోట్లు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్నాయని ఆ ప్రకటనలో తెలియజేసింది.              



Related Post