కల్వకుంట్ల కవిత రేపే విడుదల?

August 11, 2024


img

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో దాదాపు 5 నెలలుగా తీహార్ జైల్లో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు రేపు (సోమవారం) విచారణ చేపట్టనుంది. ఆమె ఈ వారంలో బెయిల్‌పై విడుదలై బయటకు వస్తారని బిఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ మొన్న మీడియాతో అన్నారు.

ఆమె అరెస్ట్ అయినప్పటి నుంచి కేటీఆర్‌ ఇంతవరకు ఆమె బెయిల్‌ గురించి మాట్లాడలేదు. తొలిసారిగా బెయిల్‌పై బయటకు వస్తారని చెప్పారు. ఆయనకు ఖచ్చితమైన సమాచారం ఉండే ఉంటుంది కనుకనే ఆవిదంగా చెప్పి ఉండవచ్చు. 

ఈ కేసులో ప్రధాన నిందితులుగా పేర్కొనబడుతున్న ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్‌, మాజీ డెప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలు ఇప్పటికే బెయిల్‌పై విడుదలై బయటకు వచ్చారు. కనుక  సుప్రీంకోర్టు రేపు ఆమెకు బెయిల్‌ మంజూరు చేసే అవకాశం ఉందని భావించవచ్చు.

ఆ తర్వాత ఏ ఈ కేసు ఇక ఎన్ని సంవత్సరాలు సాగుతుందో ఎవరికీ తెలియదు. కనుక కల్వకుంట్ల కవితకి బెయిల్‌ లభిస్తే ఈ కేసు నుంచి విముక్తి లభించిన్నట్లే భావించవచ్చు. 


Related Post