తెల్ల రేషన్ కార్డులు జారీ ఇంకా ఎప్పుడో?

August 10, 2024


img

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పుడే 8 నెలలు కానీ ఇంత వరకు తెల్ల రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో వాటి కోసం ఎదురుచూస్తున్న ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరో పక్క బిఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు జారీ చేయకుండా ప్రజలను మోసగిస్తోందంటూ విమర్శలు గుప్పిస్తోంది. 

అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి సిద్దంగా లేదు. దేశవ్యాప్తంగా వివిద రాష్ట్రాలలో తెల్ల రేషన్ కార్డులకు ఎటువంటి విధానాలు పాటిస్తున్నాయో అధ్యయనం చేసిన తర్వాతే జారీ చేయాలని నిర్ణయించుకుంది. వీటిపై సక్సేనా కమిటీ సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. 

ఆ ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో లక్షన్నర, పట్టణ ప్రాంతాలలో వార్షికాదాయం రూ.2 లక్షలు ఉన్నవారు తెల్ల రేషన్ కార్డులకు అర్హులవుతారు. తెల్ల రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్నందున ఇకపై డిజిటల్ కోడ్ ఉన్న స్వైపింగ్ కార్డులను జారీ చేయాలని భావిస్తోంది. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంకా ఎప్పుడు తెల్ల రేషన్ కార్డులు ఇస్తుందో నిర్ధిష్టంగా చెప్పడం లేదు.


Related Post