బిఆర్ఎస్ పార్టీకి జయేష్ రంజన్ చేత జవాబు... మంచి ఐడియా!

August 08, 2024


img

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి బృందం ప్రస్తుతం అమెరికా పర్యటనలో పారిశ్రామికవేత్తలు, ఐ‌టి కంపెనీల ప్రతినిధులతో వరుసగా సమావేశాలు అవుతూ పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంటోంది.

తెలంగాణకు పెట్టుబడులు సాధించడానికి అమెరికా వెళ్ళినందుకు సిఎం రేవంత్‌ రెడ్డిని అభినందిస్తున్నానని ట్వీట్‌ చేసిన కేటీఆరే, అందుకు పూర్తి భిన్నంగా రేవంత్‌ రెడ్డి చేసుకుంటున్న ఒప్పందాలన్నీ బూటకమే అనే భావన కలిగించేదుకు ప్రయత్నిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

సిఎం రేవంత్‌ రెడ్డి సోదరుడుకి చెందిన ‘స్వచ్ బయో’ అనే కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, కానీ ఎటువంటి కంపెనీ లేదని, రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చేస్తున్నాయంటూ ప్రజలను మాభ్య పెట్టేందుకే ఇటువంటి సూట్ కేసు కంపెనీలను చూపిస్తున్నారని కేటీఆర్‌ ఆరోపిస్తున్నారు. 

కేటీఆర్‌ విమర్శలకు ఐ‌టి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు జావాబు చెప్పవచ్చు. కానీ తెలివిగా ఇదివరకు కేటీఆర్‌ విదేశీ పర్యటనలలో పాల్గొని తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రప్పించడంలో కీలక పాత్ర పోషించిన ఐ‌టి శాఖ ముఖ్య కారదర్శి జయేష్ రంజన్ చేత జవాబు చెప్పించారు. 

తెలంగాణ అభివృద్ధికి దోహదపడేవిదంగా తమ పర్యటన సాగుతోందని, తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రప్పించిన తన అనుభవంతో మరెన్నో అంతర్జాతీయ సంస్థలతో చర్చలు, ఒప్పందాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో సందేశం కూడా పోస్ట్ చేశారు. 


Related Post