ఇదే లాస్ట్ వార్నింగ్: కేటీఆర్‌

August 08, 2024

img

బిఆర్ఎస్, బీజేపీల మద్య ఢిల్లీలో ఏదో జరుగుతోందంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిపై బిఆర్ఎస్‌ పార్టీ ఇంతకాలం స్పందించక పోవడంతో నిప్పు లేనిదే పొగ రాదనే అనుమానాలు బలపడ్డాయి. ఎట్టకేలకు బిఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వాటిపై ఘాటుగా స్పందించారు.

“ఈ రెండున్నర దశాబ్ధాలలో మాకు వ్యతిరేకంగా జరిగిన అనేక కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొంటూనే తెలంగాణ సాధించుకుని అభివృద్ధి చేశాము. కానీ కొందరు రాజకీయ దురుదేశ్యంతో మాపై పనిగట్టుకొని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇకనైనా అది మానుకొని బేషరతుగా క్షమాపణలు తెలియజేయాలని సూచిస్తున్నాను. లేకుంటే అటువంటివారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తున్నాను.

బిఆర్ఎస్‌ పార్టీ తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తుంది. ఈ ప్రయత్నంలో మేము పడతాం, లేస్తాం, తెలంగాణ కోసమే పోరాడతాం! కాని తల వంచం. ఎప్పటికైనా, ఎన్నటికైనా! జై తెలంగాణా!” అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

24 Years of Resilience and Devotion!
Against Hundreds of Saboteurs,
Standing up Against Thousands of Malicious Propagandists & Schemes!
For 24 Years!

And yet, we prevailed. We fought tirelessly, and we achieved and built a state that has become a beacon of progress and pride. A…
— KTR (@KTRBRS) August 7, 2024

Related Post