దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలలో ఖాళీ అయిన 12 రాజ్యసభ స్థానాలకు ఈసీ నేడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, బిహార్, హర్యానా, అస్సోం, త్రిపురలో ఖాళీ అయిన సీట్లకు ఉపఎన్నికలు జరుగనున్నాయి.
తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఎంపీ కే కేశవ రావు రాజీనామాతో ఖాళీ అయిన సీటుకి ఆగస్ట్ 14న నోటిఫికేషన్ వెలువడుతుంది. ఆరోజు నుంచి ఆగస్ట్ 21వరకు నామినేషన్స్ దాఖలుకి, 27వరకు ఉపసంహరణకు గడువు ఉంతుంది.
తెలంగాణ, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాలలో ఒకే రోజున సెప్టెంబర్ 3వ తేదీన ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉప ఎన్నిక జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లు లెక్కించి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు.
తెలంగాణలో కాంగ్రెస్‌కు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నందున ఆ ఒక్క సీటు కాంగ్రెస్ పార్టీయే గెలుచుకునే అవకాశం ఉంది. మిగిలిన 11 సీట్లు ఎన్డీయే కూటమి గెలుచుకునే అవకాశం ఉంది.