బడ్జెట్‌తో పెరిగేవి తరిగేవి ఇవే....

July 23, 2024


img

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వరుసగా ఏడవసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టి సరికొత్త రికార్డ్ సృష్టించారు. ఆమె మంగళవారం లోక్‌సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఎప్పటిలాగే కొన్ని వస్తువులపై పన్ను తగ్గించారు. మరికొన్నిటిపై పెంచారు. ఆ ప్రభావంతో కొన్ని వస్తువుల ధరలు తగ్గబోతున్నాయి. మరికొన్ని పెరుగబోతున్నాయి. 

భారతీయులకు అత్యంత ఇష్టమైన బంగారు, వెండి ఆభరణాలపై 5 శాతం, ప్లాటినం ఆభరణాలపై 6.5 శాతం పన్ను పన్ను తగ్గించడంతో వాటి ధరలు తగ్గుతాయి. అలాగే మొబైల్ ఫోన్లలో ఉండే ప్రింటడ్‌ సర్క్యూట్ బోర్డులపై. మొబైల్ చార్జర్లు, లెదర్ ప్రొడక్ట్స్, చేపలు, రొయ్యల మేతపై 5 శాతం పన్ను తగ్గించడంతో సీఫుడ్‌ ధరలు తగ్గుతాయి.

క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మూడు ప్రధాన ఔషదాలపై 6 శాతం పన్ను తగ్గించడంతో ఆ మేరకు ఆ మూడు మందుల ధరలు తగ్గబోతున్నాయి. 

అమ్మోనియం నైట్రేట్, పర్యావరణానికి నష్టం కలిగించే ప్లాస్టిక్‌పై 10 శాతం పన్ను పెంచడంతో ప్లాస్టిక్  ఉత్పత్తుల ధరలు ఆ మేరకు పెరుగనున్నాయి. 

టెలికాం పరికరాలలో వినియోగించే మదర్ బోర్డుల దిగుమ్తి సుంకం 5 శాతం పెంచినందున ఆ మేరకు వాటి ధరలు పెరుగనున్నాయి.


Related Post