నిర్మలమ్మ బడ్జెట్‌లో ఆదాయపన్ను శ్లాబ్స్ ఎలా ఉన్నాయంటే...

July 23, 2024


img

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రస్తుతం లోక్‌సభలో 2024-25 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు. దానిలో ఆదాయపన్ను శ్లాబ్స్ పెంచి ఉపశమనం కలిగిస్తారని వేతనజీవులు అందరూ ఎదురుచూస్తున్నారు. కానీ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దానిలో పెద్దగా మార్పులు చేయకపోవడం నిరాశ కలిగించింది. 

తాజా బడ్జెట్‌లో కొత్త పన్ను విధానం ఈవిదంగా ఉంది: 

రూ.3 లక్షలలోపు వార్షిక ఆదాయంపై ఎటువంటి పన్ను ఉండదు. 

రూ.3 నుంచి రూ. 7 లక్షలలోపు ఆదాయంపై 5 శాతం పన్ను. 

 రూ.7 నుంచి రూ.10 లక్షలలోపు ఆదాయంపై 10 శాతం పన్ను.

రూ.10 నుంచి రూ.12 లక్షలలోపు ఆదాయంపై 15 శాతం పన్ను.

రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలలోపు ఆదాయంపై 20 శాతం పన్ను.

రూ.15 లక్షల పైన ఆదాయంపై 30 శాతం పన్ను.

స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుంచి రూ.75,000కి పెంపు. 


Related Post