షూటింగ్‌లో బిజీగా ఉన్నాను మరోసారి వస్తా: రాజ్‌ తరుణ్

July 19, 2024


img

టాలీవుడ్‌ నటుడు రాజ్‌ తరుణ్, లావణ్యల పోలీస్ కేసులో ఇంటర్వెల్ వచ్చింది. ఈ నెల 18వ తేదీన వచ్చి లావణ్య ఇచ్చిన పిర్యాదులపై సంజాయిషీ ఇవ్వాలని నార్సింగ్ పోలీసులు నోటీస్‌ పంపించారు.

కానీ ప్రస్తుతం 'పురుషోత్తముడు' సినిమా షూటింగ్‌, ప్రోమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నందున, విచారణకు హాజరుకాలేనని, తనకు కొంత గడువు ఇవ్వాలని కోరుతూ రాజ్‌ తరుణ్ తన లాయర్ ద్వారా పోలీసులకు ఓ లేఖ పంపారు.

అతను చెప్పిన కారణం సహేతుకంగా ఉండటంతో కొన్ని రోజుల సమయం ఇచ్చేందుకు అంగీకరించారు. త్వరలోనే మళ్ళీ మరోసారి నోటీస్‌ పంపించనున్నారు.  

రాజ్‌ తరుణ్, లావణ్య గత 10-11 ఏళ్ళుగా సహజీవనం చేస్తున్నారు. అయితే కొన్ని నెలల నుంచి రాజ్‌ తరుణ్ తన సహ నటి మాల్వీ మల్హోత్రాకు దగ్గరవుతూ తనని వదిలించుకోవాలని చూస్తున్నాడని, అతని వలన తాను గర్భం దాలిస్తే అబార్షన్ చేయించాడని, తనను శారీరికంగా వాడుకొని ఇప్పుడు మోసం చేస్తున్నాదంటూ లావణ్య జూలై 5వ తేదీన నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల సూచన మేరకు రాజ్‌ తరుణ్‌తో సహజీవనం చేసినట్లు, అబార్షన్ జరిగిన్నట్లు సాక్ష్యాధారాలను లావణ్య పోలీసులకు సమర్పించారు. దాంతో పోలీసులు రాజ్‌ తరుణ్‌తో పాటు మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడిపై కూడా కేసు నమోదు చేసి ముగ్గురికీ నోటీసులు పంపారు.


Related Post