అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సామాన్య ప్రజలకు కూడా ఎంతో మేలు చేస్తోంది. కానీ అదే నేరగాళ్ళ చేతిలో ఆయుధంగా కూడా మారుతోంది. దాని సాయంతో ఎవరూ ఊహించని విదంగా ప్రజలను మోసాగిస్తున్నారు. తాజాగా వాట్సప్ కాల్స్‌లో సరికొత్త రకం మోసం గురించి తెలంగాణ డిజిపి జితేంద్ర సోషల్ మీడియా ద్వారా ప్రజలను అప్రమత్తం చేశారు.
కొందరు మోసగాళ్ళు వాట్సప్ డీపీలో పోలీస్ యూనిఫారంలో ఉన్న ఫోటోలు పెట్టుకొని ప్రజలకు ఫోన్లు చేసి మీ బంధుమిత్రులు అరెస్ట్ అయ్యారనో లేదా వారి పేరుతో వచ్చిన మాదకద్రవ్యాలు వచ్చాయనో లేదా మరేదో నేరం చేశారనో నమ్మించి, భయపెట్టి డబ్బులు గుంజేందుకు ప్రయత్నిస్తున్నారని, అటువంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రజలలో పోలీసులంటే సహజంగా ఉండే భయాన్ని అడ్డం పెట్టుకొని నేరగాళ్ళు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు భావించవచ్చు.