ఆగస్ట్ 15లోగా పంట రుణాలు మాఫీ చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ వివరాలు:
1. 2018 డిసెంబర్ 12 నుంచి 2023, డిసెంబర్ 9వరకు తీసుకున్న పంట రుణాలకు ఇది వర్తిస్తుంది.
2. తెల్ల రేషన్ కార్డు కలిగినవారు మాత్రమే దీనికి అర్హులు.
3. అసలు, వడ్డీ కలిపి రెండు లక్షల వరకు రుణమాఫీ చేయబడుతుంది. ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలో జమచేయబడుతుంది.
4. లబ్ధిదారులకు రూ.2 లక్షలకు మించి రుణం ఉన్నట్లయితే ముందుగా ఆ సొమ్ముని వారు బ్యాంకుకి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెండు లక్షలు వారి ఖాతాలో జమా చేస్తుంది.
5. ఓ కుటుంబంలో 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్నట్లయితే ముందుగా ఆ కుటుంబంలో మహిళల పేరిట తీసుకున్న రుణం మాఫీ చేయబడుతుంది. ఆ తర్వాత దామాషా పద్దతిలో పురుషుల రుణమాఫీ చేయబడుతుంది.
6. ముందుగా తక్కువ మొత్తంలో రుణాలను మాఫీ చేస్తూ తర్వాత క్రమంగా 2 లక్షల వరకు రుణమాఫీ చేయబడుతుంది.
7. కౌలు రైతులు, రీషెడ్యూల్ చేయబడిన రుణాలకు, స్వయం సహాయక బృందాలు, ఉమ్మడిగా తీసుకున్న రుణాలు, రైతు మిత్ర బృందాలు, ప్రైవేట్ కంపెనీలు.
8. వ్యవసాయ కమీషనర్‌గా పంట రుణాల మాఫీ అధికారిగా వ్యవహరిస్తారు. ప్రతీ బ్యాంకులో ఓ నోడల్ అధికారిని నియమిస్తారు. నోడల్ అధికారి, అటు ప్రభుత్వం ఇటు రైతులకు మద్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.
9. నోడల్ అధికారి ప్రతీ లబ్ధిదారుడి వివరాలను ధృవీకరిస్తూ ప్రభుత్వానికి సమర్పించే డాక్యుమెంట్లపై తప్పనిసరిగా డిజిటల్ సంతకాలు చేయాలి.
10. ఎవరైనా మోసపూరితంగా పంట రుణాలు మాఫీని వినియోగించుకున్నట్లు తెలిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు చేయపట్టడంతో పాటు, పొందిన సొమ్ముని తిరిగి వసూలు చేయబడుతుంది.